ఏపీలో మే 6న రీపోలింగ్.. ఐదు చోట్ల..!

-

ఈనెల 6న ఆ ఐదు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని ఈసీ నుంచి రాష్ట్ర అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు చేపడుతున్నారు.

ఏపీలో కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఇదివరకే ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈనేపథ్యంలో మే 6న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని రెండు చోట్ల, నెల్లూరు జిల్లాలో రెండు చోట్ల, ప్రకాశం జిల్లాలోని ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు.

ఈనెల 6న ఆ ఐదు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని ఈసీ నుంచి రాష్ట్ర అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు చేపడుతున్నారు.

ఏపీలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మరికొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైంది. కొన్ని చోట్ల ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఇవి పోలింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయన్న ఉద్దేశంతో రీపోలింగ్ జరిపేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. ఆ నివేదికను పరిశీలించిన సీఈసీ.. ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు అనుమతిచ్చింది. మే 6న జరగనున్న ఐదో దశ లోక్‌సభ ఎన్నికలతో పాటే ఈ ఐదు పోలింగ్ బూతుల్లోనూ రీపోలింగ్ నిర్వహించనున్నారు.

గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని కేసనపల్లిలోని 94వ నెంబర్ పోలింగ్ బూత్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో 244వ పోలింగ్ బూత్, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లి నుంచి 41వ పోలింగ్ బూత్, నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నుంచి ఆటకానితిప్పలో 197వ పోలింగ్ బూత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 247వ పోలింగ్ బూత్‌లో అధికారులు రీపోలింగ్ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news