ట్రైలర్ తోనే రికార్డుల పని పడుతున్న మహర్షి..!

256

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. మహేష్ 25వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ క్రేజీగా మారింది. ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. బుధవారం సాయంత్రం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. విక్టరీ వెంకటేష్, యువ హీరో విజయ్ దేవరకొండ అతిథులుగా అటెండ్ అవగా వెంకటేష్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ప్రపంచాన్ని ఏలేద్దామనుకున్న రిషి జర్నీనే మహర్షి సినిమా.. మహేష్ స్టూడెంట్, సిఈఓ, రైతు ఇలా మూడు డిఫరెంట్ రోల్స్ పోశిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఘట్టమనేని ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. పవర్ ప్యాక్డ్ కంటెంట్ తో రాబోతున్న ఈ మహర్షి సినిమా ట్రైలర్ కూడా రికార్డులు సృష్టిస్తుంది.

స్టార్ సినిమా అంటే టీజర్, ట్రైలర్ రికార్డులు కూడా లెక్కించాల్సిందే. అలానే నిన్న సాయంత్రం రిలీజైన మహర్షి ట్రైలర్ 8 గంటల్లో 2 మిలియన్ వ్యూస్ సాధించింది. ట్రైలర్ తోనే మహేష్ మహర్షి రికార్డుల పని పడుతుంది. రిలీజ్ ముందు పరిస్థితి ఇలా ఉంటే రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.