కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ ఫలించింది.ఏడవ వేతన సంఘం ఇప్పటికే కేంద్రానికి ఉద్యోగుల జీతాల పెంపుపై పలు సూచనలు చేసింది.ఫిట్ మెంట్, డీఏ విషయంలో కేంద్రానికి పలు సూచనలు చేసినప్పటికీ కేంద్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేక పోతుంది.త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏడవ వేతన సంఘం పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్ మెంట్ పెంపు విషయంలో రేపు అంటే బుధవారం క్లారిటీ రానుంది.రేపు(బుధవారం) కేబినేట్ భేటీ కానున్న విషయం తెలిసిందే. కేబినేట్ భేటీలో ఫిట్ మెంట్ పై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెవెన్త్ పే కమిషన్ ఇప్పటికే ఫిట్ మెంట్ విషయమై కేంద్రంతో చర్చించింది. ఫిట్ మెంట్ నిర్ణయం కేబినేట్ సమావేశంలో కేంద్రం తీసుకుంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.ప్రస్తుతం ఉన్న ఫిట్ మెంట్ 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నాయి..ఈ విషయం పై గత కొన్ని రోజులుగా చర్చలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే..
ఏడవ వేతన సంఘం కూడా కేంద్రానికి అదే సూచన చేసింది. దీంతో ఫిట్ మెంట్ ను పెంచితే.. ప్రస్తుతం ఉన్న కనీస వేతనం 18 వేల రూపాయల నుంచి రూ.26 వేలకు చేరనుంది. అంటే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీసం వేతనం ఇక నుంచి రూ.26 వేలు కానుంది. దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ను కూడా చెప్పనుంది.ఏడవ వేతన సంఘం పలు సిఫారసులను కేంద్రానికి 2017 లో అందజేసింది.వాటిని అప్పుడే ఆమొదించిన కూడా ప్రభుత్వం జీతాల పెంపు పై మాత్రం స్పష్టత రాలేదు.