చర్చిలో తొక్కిసలాట.. 31 మంది దుర్మరణం..!!

-

నైజీరియాలోని పోర్ట్ హార్‌కోర్ట్ సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. హార్‌కోర్ట్ లోని చర్చి వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, శనివారం ఉదయం చర్చి వద్ద చారిటీ ఈవెంట్ నిర్వహించారు. ఆహార పదార్థాలు, కానుకలు పంపిణీ చేశారు. దీంతో అక్కడి స్థానికులు పెద్ద సంఖ్యలో దూసుకొచ్చారు. ఆ తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

పోర్ట్ హార్‌కోర్ట్ సిటీ
పోర్ట్ హార్‌కోర్ట్ సిటీ

ఆహార పదార్థాలు, గిఫ్టులు ఇవ్వడంతో భారీగా జనం తరలి వచ్చారు. ప్రజలందరూ ఒక్కసారిగా ఎగబడటంతో.. తొక్కిసలాటకు దారి తీసిందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్రికాలో అత్యధికంగా ముడి చమురును ఉత్పత్తి.. అధిక జనాభా కలిగిన దేశాల్లో నైజీరియా ఒకటి. దేశంలో ప్రధాన చమురు క్షేత్రం పోర్ట్ హార్‌కోర్ట్. ఇక్కడ ప్రతి పది మందిలో నలుగురి దారిద్ర్యరేఖ దిగువన బతుకుతున్నారని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news