‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఉడుగుల..తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘విరాట పర్వం’..ఇది టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.
కరోనా మహమ్మారి వలన ఎక్కువ ఇబ్బందులు పడ్డ సినిమా ఇదే. కాగా, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ముందుకు జరిపారు మేకర్స్ . జూన్ 17న పిక్చర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా మరో అప్ డేట్ ఇచ్చేశారు దర్శకుడు వేణు ఉడుగుల.
చిత్రంలోని ‘‘నగాదారిలో’’ అనే సాంగ్ ను జూన్ 2న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఉడుగుల ట్వి్ట్టర్ వేదికగా వీడియోను ట్వీట్ చేశాడు. సదరు ట్వీట్ లో వినూత్నంగా సినిమా పాట విడుదత తేదీ, వివరాలను ప్రకటించారు. ఈ పాటను వరంగల్ కు చెందిన వరం ఆలపించగా, సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. లిరిక్స్ ను దేవేరి నరేందర్, భరద్వాజ్ కలిసి అందించారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. రానా, సాయిపల్లవి జంటగా నటించగా, నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు.
నేటి #విరాటపర్వంవార్తలు లోని ముఖ్యాంశం…
విరాటపర్వం చిత్రంలోని 'నగాదారిలో ' పాటని, JUNE 2వ తారీఖున విడుదల చేస్తూ…చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తున్న బృందం.#Nagaadaarilo Song From #VirataParvam on JUNE 2nd 💥💥#VirataParvamOnJune17th pic.twitter.com/3sCVFDnzg4
— v e n u u d u g u l a (@venuudugulafilm) May 31, 2022