దెయ్యాలు కట్టిన దేవాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

-

అసలు నిజంగా దెయ్యాలు ఉన్నాయా..? ఉంటే ఎలా, ఎక్కడ ఉన్నాయి.ఇలాంటి సందెహాలు రావడం కామన్..సైన్స్ నిపుణులు లేవని అంటారు..కానీ,కొన్నిటిని చూస్తే మాత్రం నమ్మకుండా ఉండలేరు..దేవుడు ఉన్నాడని నమ్మితే దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్మాలి..అయితే ఇప్పుడు ఒక వార్త సంచలనంగా మారింది. ఓ ఆలయాన్ని దెయ్యాలు కట్టించాయని చెబుతున్నారు.అసలు ఆ ఆలయం నిజంగా ఉందా..ఉంటే ఎక్కడ వుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో బొమ్మవర అనే గ్రామంలో ఓ గుడి ఉంది. ఆ గుడిపేరు సుందరేశ్వరాలయం. సుందరేశ్వరుడు అంటే శివుడు.ఇక్కడ శివలింగం ఎంతో అందంగా ఉంటుంది అందుకే సుందరేశ్వరుడు అని పేరు.అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకుని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారు.

దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో తను వశం చేసుకున్నాడు. వాటి జుట్టు కత్తిరించి బంధించాడు తమను విడిపించాలని దెయ్యాలు వేడుకోవడంతో పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి ఊరి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోవాలని మాంత్రికుడు ఆంక్షలు పెట్టాడు. తప్పనిపరిస్థితుల్లో రాత్రికి రాత్రే గుడి నిర్మించిన దెయ్యాలు అక్కడి నుంచి పారి పోయాయి.

అయితే మామూలు గుడుల మీద దేవతల బొమ్మలు ఉంటాయి.కానీ ఆ ఆలయం మీద మాత్రం దెయ్యాల బొమ్మలు కనిపిస్తాయట..అయితే గుడిని మళ్లీ నిర్మించిన దెయ్యాలు శివలింగాన్ని ప్రతిష్టించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాయట. అప్పటి నుంచి ఆ గుడిలో శివలింగం లేకుండా అలాగే ఉండేదట. కొన్నేళ్ల తర్వాత ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతుంటే పెద్ద శివలింగం బయట పడింది. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్టించి అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. భూతనాథుడిని అక్కడ ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అక్కడి వారికి అంతా మంచే జరిగిందట..అందుకే ఆ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించిన ఆలయం అంటారు.

Read more RELATED
Recommended to you

Latest news