బిజినెస్ ఐడియా: అతి తక్కువ పెట్టుబడితో రోజుకు రూ.2 వేల ఆదాయం పొందే అవకాశం..

-

మన దేశం వాహనాల వినియోగం లో ఇతర దేశాలతో పోటీ పడుతుంది..రోజు రోజుకు వాహానాలను వాడటం పెరిగిపోతుంది. వాహనాల డిమాండ్ పెరిగే కొద్ది కొన్ని కొత్త వ్యాపారులు కూడా పుట్టుకోస్తున్నాయి.అందులో ఒకటి కారు వాషింగ్ బిజినెస్..నేడు కార్లు మరియు ఇతర వాహనాలను కడగడం ద్వారా దేశంలోని దాదాపు ప్రతీ నగరంలో చాలా మంచి డబ్బు సంపాధిస్తున్నారు. కార్ వాషింగ్ వ్యాపారంలో 70 శాతం వరకు ఆదా అవుతుంది.

ప్రస్తుతం అనేక మంది వద్ద విపరీతమైన డబ్బు, వాహనాలు ఉంటున్నాయి కానీ తమ వాహనాలను శుభ్రం చేసుకునేందుకు మాత్రం సమయం ఉండడం లేదు. కారు లేదా బైక్‌ ను చాలా మంది ప్రజలు వాషింగ్ సెంటర్‌లోనే కడిగించడానికి ఇష్టపడుతున్నారు.ఈ వ్యాపారం తక్కువ ఖర్చుతో కూడుకున్నది..మంచి లాభాలను ఇస్తుంది. ఈ బిజినెస్ ప్లాను చేసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు..

కార్ వాషింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీకు కనీసం 1500 చదరపు అడుగుల స్థలం, కనీసం ఇద్దరు కార్మికులు, నీరు మరియు విద్యుత్ కనెక్షన్ ఉన్న కొన్ని యంత్రాలు అవసరం. కార్ వాషింగ్ స్టాండ్‌ని నిర్మించడానికి, కారును పార్క్ చేయడానికి మరియు సందర్శించే కస్టమర్‌లు కూర్చునేందుకు మరియు వాటర్ పంప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి స్థలం అవసరం ఉంటుంది..

ముందుగా కొన్ని ఎయిర్ కంప్రెసర్, ఫోమ్ జెట్ సిలిండర్, హై ప్రెజర్ వాటర్ పంప్ మరియు వాక్యూమ్ క్లీనర్ అవసరం. ఈ యంత్రాలు చాలా ఖరీదైనవి కావు. ఈ యంత్రాలన్నీ రెండు లక్షల రూపాయల్లోనే కొనేయొచ్చు..మీ సొంత స్థలంలో అయితే మరీ మంచిది.సెంటర్‌కు రోజూ 20 వాహనాలు వాషింగ్ కోసం వస్తే.. మీకు కనీసం రూ.3000 లభిస్తుంది. ఖర్చులన్నీ తీసి వేసినా.. ప్రతిరోజు రెండు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు నెలలో 60 వేల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. కస్టమర్స్ పెరిగే కొద్ది డబ్బులే..డబ్బులు.. మీకు ఈ ఆలోచన ఉంటే స్టార్ట్ చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news