అద్దె బస్సులపై ఏపీ ఆర్టీసీ కీలక నిర్ణయం

-

ఏపీఎస్సార్టీసీలోకి భారీగా అద్దె బస్సులు రానున్నాయి. ఈమేరకు టెండర్లు ఆహ్వానించిన ఆర్టీసీ….రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 659 అద్దె బస్సులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 9 ఏసీ స్లీపర్‌ బస్సులు, 47 నాన్‌ ఏసీ స్లీపర్‌, 6 ఇంద్ర, 46 సూపర్‌ లగ్జరీ బస్సులు, 22 అల్ట్రా డీలక్స్‌, 70 ఎక్స్‌ప్రెస్‌, 208 అల్ట్రా పల్లె వెలుగు, 203 పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్‌ప్రెస్‌, 9 సిటీ ఆర్డినరీ బస్సులకు టెండర్ల ఆహ్వానం ఇచ్చింది ఆర్టీసీ.

జిల్లాల వారీగా అద్దె బస్సులు, సంఖ్యను నిర్ణయించి.. ఆమేరకు టెండర్లకు ఆహ్వానం పంపింది.MSTC ఈ-కామర్స్‌ పోర్టల్‌ ద్వాకా టెండర్ల ప్రక్రియ జరగనుంది. ఇవాళ్టీ నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బిడ్లు దాఖలుకు గడువు పెట్టింది ఆర్టీసీ.

 

జిల్లాల వారీగా అద్దెకు తీసుకుంటున్న బస్సుల వివరాలు..:*

శ్రీకాకుళం-39, మన్యం-32, విజయనగరం-14, విశాఖ-61, అనకాపల్లి-22, కాకినాడ-41.

తూ.గో-27, కోనసీమ-39, ప.గో-52, ఏలూరు-21, కృష్ణా-28, ఎన్టీఆర్-12

గుంటూరు-26, పల్నాడు-30, బాపట్ల-6, ప్రకాశం-10, నెల్లూరు-39.

తిరుపతి-35, చిత్తూరు-2, అన్నమయ్య-10, వైఎస్సార్-6.

నంద్యాల-29, కర్నూలు-14, అనంత-31, సత్యసాయి-33

Read more RELATED
Recommended to you

Latest news