తన ప్రైవేటు భాగాలు చూపిస్తూ.. మహిళను అడ్రస్ అడిగిన కామాంధుడు..

కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. రోజూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని శిక్షిస్తున్నారని వార్తలు చదువుతున్నా.. చూస్తున్నా కానీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పుడు దేశ రాజధానిలో మరో ఘటన చోటు చేసుకుంది. జూన్‌ 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రో స్టేషన్‌లోనే ఓ మహిళపై లైంగిక వేధింపులకు దిగాడో కామాంధుడు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం జూన్ 2న మ‌హిళ ఢిల్లీ మెట్రో రైలు య‌ల్లో లైన్‌లో ప్ర‌యాణిస్తుండ‌గా ఓ వ్య‌క్తి ఆమెను ఓ అడ్ర‌స్ అడిగాడు.

Delhi: Woman alleges sexual harassment at metro station, DMRC says  'investigation underway' | Mint

అడ్రస్ వివ‌రాలు తెలిపిన అనంత‌రం ఆమె జోర్ బాగ్ మెట్రో స్టేష‌న్‌లో దిగి క్యాబ్ బుక్ చేసుకునేందుకు అక్క‌డున్న కుర్చీలో కూర్చుంది. ఈలోగా నిందితుడు మ‌రోసారి ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చి త‌న‌కు కావాల్సిన అడ్ర‌స్ గురించి అడిగాడు. మ‌రోసారి ఆమె ఆయా వివ‌రాలు చెబుతుండ‌గా నిందితుడు త‌న ప్రైవేట్ భాగాలు చూపుతూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో.. నిందితుడి చ‌ర్య‌ల‌తో భ‌య‌ప‌డిన మ‌హిళ అక్క‌డి నుంచి ప‌రుగుతీసిన దృశ్యాలు మెట్రో స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఆపై నిందితుడు కూడా ఘ‌ట‌నా స్ధ‌లం నుంచి ప‌రార‌య్యాడు. మ‌హిళ ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్
చేశారు.