BREAKING : భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి ప్రవాహం

-

భద్రాచలం వద్ద క్రమక్రమంగా గోదావరి నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. భద్రాచలం గోదావరి నీటిమట్టం 71.2 అడుగులుగా ప్రస్తుతం ఉంది.గత అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత గోదావరి నిలకడ ఎగువన వరద తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గత రాత్రి 71.3 అడుగులు ఉన్న గోదావరి ఐదు గంటల సమయంలో 71. 2 అడుగులకి చేరింది.

ఏడు దశాబ్దాల చరిత్రలో మూడుసార్లు 70 అడుగులకు చేరుకుంది గోదావరి.
కరకట్ట నిర్మాణం తర్వాత మొదటిసారిగా 70 అడుగులకు చేరుకుంది గోదావరి. 22 సంవత్సరాలుగా భద్రాచలం పట్టణ వాసులను రక్షిస్తోంది గోదావరి కరకట్ట. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పట్టణంలోని నాలుగు ప్రాంతాలకు వరద నీరు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.

Date:- *16-07-2022*

Time :- *6.00 AM*

Godavari water level at BCM :- *71.10ft*

Discharge :- *24,34, 059 Cusecs*

 

1st Warning Level :- *43.00 ft.*

2nd Warning Level :- *48.00 ft*

3 rd Warning Level:- *53.00 ft(In force)*

Read more RELATED
Recommended to you

Latest news