జబర్దస్త్ స్టేజ్ పై తన భార్యను పరిచయం చేసిన వెంకీ..!!

-

ఎంతోమంది సామాన్య వ్యక్తులు నేడు సెలబ్రిటీలు అయ్యారు అంటే అందుకు కారణం జబర్దస్త్ అని చెప్పవచ్చు. కేవలం తమ కామెడీతో ప్రేక్షకులను అలరించడానికి జబర్దస్త్ ఒక వేదికగా చేసుకున్న వీళ్ళు నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులను సొంతం చేసుకున్నారు అంటే అందుకు కారణం జబర్దస్త్ మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఈ జబర్దస్త్ ను నేడు అందరూ కలిసి కష్టాల్లోకి తోసేశారు. గెటప్ శ్రీను, సుధీర్, చమ్మక్ చంద్ర , కిరాక్ ఆర్పి లాంటి వాళ్లందరికీ మంచి లైఫ్, ఫేమ్, డబ్బు ఇచ్చిన జబర్దస్త్ ను వీరందరూ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ షో ని వదిలిపెట్టి వెళ్లడం చాలా బాధాకరమని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఇప్పుడిప్పుడే ఉన్నత స్థానానికి ఎదుగుతున్న మరికొంతమంది కమెడియన్లు తమ కుటుంబాలను కూడా జబర్దస్త్ వేదికపై పరిచయం చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.

ఇక అలాంటి వారిలో వెంకీ మంకీ కూడా ఒకరు. ఇక తన కామెడీతో , లేడీ గెటప్లతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్న వెంకీ ఇటీవల జబర్దస్త్ వేదిక పైన తన భార్యను అలాగే పిల్లలను కూడా పరిచయం చేశాడు. ఇక ఎన్నెన్నో జన్మల బంధం పాటతో వెంకీ దంపతులిద్దరూ ఎంట్రీ ఇచ్చారు. మరి కుటుంబ సభ్యులు వచ్చాక కమెడియన్స్ పంచులు వేయించుకోవడం మామూలే కదా.. ఇక అలాగే వెంకి కూడా తన మీద సెటైర్లు వేయించుకున్నారు. వెంకీ మీద ఆయన భార్య పంచులు వేస్తుంటే జడ్జ్లు , యాంకర్ కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇక వెంకీ తన ప్రేమ వివాహం గురించి వెల్లడిస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నప్పుడు తన భార్య కూచిపూడి డాన్సర్ అని తెలియజేశాడు. ఇక అలాగే తనే మొదటగా ఆమెకు లవ్ ఎక్స్ప్రెస్ చేయగా ఆమె కూడా ఒప్పుకున్నట్లు, ఇక ఆమె కుటుంబం గురించి , ఆమె గురించి చాలా గొప్పగా తెలిపాడు వెంకీ.

ఇక స్టేజిపై మోకాలుపై కూర్చొని గులాబీ పువ్వుతో ప్రపోజ్ చేస్తూ వెంకీకి సర్ప్రైజ్ ఇచ్చింది ఆయన భార్య. అందుకు సంబంధించిన ప్రోమో కూడా బాగా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news