సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై సిరిసిల్ల శాసనసభ్యులుKTR చేసిన అవమానకరమైన మరియు నిరాధార ఆరోపణలను, దుర్భాషలాడటాన్ని తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు పాలనా విధానాలు మరియు రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఊహించని ఇటువంటి నిరాధార ఆరోపణలు బాధ్యతారాహిత్యమైనవిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.
తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఈ సందర్భంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు పూర్తి మద్దతు తెలియజేస్తుంది. సివిల్ సర్వీసు గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి తాము అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేస్తోంది. అందువల్ల, ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని, వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం పిలుపునిస్తోంది అని పేర్కొన్నారు.