75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్వి సప్తాహాం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా జాతీయ జెండాల పంపిణీ మొదలైంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ, మైథిలి నగర్లో ఆమె జాతీయ జెండాలను పంపిణీ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. గ్రేటర్లో బల్దియా తరఫున 20 లక్షల జెండాలను అందించనున్నట్లు చెప్పారు గద్వాల్ విజయలక్ష్మి. ఇప్పటికే 8 లక్షల జెండాలను పంపిణీ చేశామన్నారు. నెక్లెస్ రోడ్లో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు గద్వాల్ విజయలక్ష్మి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూస రాజు, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ ఆధ్వర్యంలో ముషీరాబాద్, భోలక్‌పూర్‌లో జెండాలను పంచారు. కుత్బుల్లాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో జెండాలను పంపిణీ చేశారు. మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు బండ కార్తీకారెడ్డి తార్నాకలోని తన ఇంటి వద్ద పలువురికి జెండాలను అందజేశారు.
కంటోన్మెంట్ వార్డు నం.5 విక్రమ్‌పురి కాలనీలో సీఈవో అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాలను పంచారు. మల్కాజిగిరి మున్సిపల్ ఆఫీసు వద్ద ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు జెండాల పంపిణీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. మల్కాజిగిరి, వినాయక్ నగర్ డివిజన్లలోని పలు కాలనీల్లో బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి బల్దియా అధికారులతో కలిసి జెండాలను పంచారు. బండ్లగూడ జాగీర్‌లో కార్పొరేటర్ రాము ఆధ్వర్యంలో హిమాయత్‌సాగర్ ఏరియాలో డ్వాక్రా మహిళలకు జెండాలను అందజేశారు. వికారాబాద్ కలెక్టరేట్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతా రెడ్డి, కలెక్టర్ నిఖిల ఆధ్వర్యంలో జెండాల పంపిణీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.బీజేపీ షాద్‌నగర్ సెగ్మెంట్ ఇన్చార్జి నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జెండాలు పంచారు.