బతుకమ్మ చరిత్రని విశ్వవ్యాప్తం చేసిన కవితకు మీరిచ్చే గౌరవం ఇదేనా?: ఎర్రబెల్లి

-

బిజెపి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బతుకమ్మ చరిత్రను విశ్వవ్యాప్తం చేసిన కవితకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు. కవితపై కావాలనే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎర్రబెల్లి. కెసిఆర్ కుటుంబం మచ్చలేని కుటుంబం అని.. ఆ కుటుంబాన్ని మాటంటే ప్రజలు క్షమించరని అన్నారు. కెసిఆర్ పరిపాలనపై అక్కస్సుతోనే ఇలా చేస్తున్నారని అన్నారు. ఈడి, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఎర్రబెల్లి.

అన్ని రాష్ట్రాలలో బిజెపి బుద్ధి మారడం లేదన్నారు. దేవర్పులలో గొడవకు కారణం బిజెపి కార్యకర్తలేనని అన్నారు. మేము దాడి చేయదలుచుకుంటే మీరు ఎందుకు సరిపోరని అన్నారు మంత్రి. బౌన్సర్లను, కిరాయి గుండాలను పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. అసలు బండి సంజయ్ పాదయాత్రకు జనం ఆధారనే లేదన్నారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్న బండి సంజయ్ కి మోడీ ట్రైన్ ఇచ్చాడని అన్నారు. తల్లిదండ్రులకు సరిగా సేవ చేయలేని బండి సంజయ్ గుజరాతి వ్యక్తి బూట్లు మోసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news