ఏపీ
రాజధాని రైతుల నష్టపరిహారంపై దాఖలు చేసిన పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. దీనికి సంబంధించిన అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై రిజాయిండర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని న్యాయవాది ఇంద్రనీల్ హైకోర్టును కోరారు. రాజధానిపై వేసిన పిటిషన్లతో కలిపి వీటిని విచారించాలని ధర్మాసనాన్ని కోరారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టును కోరారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని భావించిన ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.ఇవీ