సుధీర్ ను జబర్దస్త్ వారే పంపేశారా.. ప్రముఖ కమెడియన్ షాకింగ్ కామెంట్..!!

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి తన స్కిట్లతో ప్రేక్షకులను అలరించిన సుడిగాలి సుదీర్.. ఆటలతో, పాటలతో, పంచులతో మరింత దగ్గరయ్యారు. ఒకవైపు తన కామెడీతో నవ్వులు పూయిస్తూనే మరొకవైపు రష్మీ తో చేసే రొమాన్స్ మరో స్థాయిని తీసుకువెళ్లింది.. అంతే కాదు వీరిద్దరూ లవ్ లో ఉన్నారనే రేంజిలో కలరింగ్ ఇస్తూ షో కి హైప్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆటో రాంప్రసాద్ , గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ముగ్గురు కలిసి చేసే స్కిట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీరి వల్లే జబర్దస్త్ టీఆర్పి రేటింగ్ పెరిగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. అంతా బాగానే ఉన్న సమయంలో ఎందుకో తెలియదు కానీ ఉన్నట్టుండి జబర్దస్త్ నుంచి సుడిగాలి సుదీర్ వెళ్లిపోయారు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఎందుకు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ఈ విషయంపై రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జబర్దస్త్ మరొక కమెడియన్ బుల్లెట్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా గణేష్ పండగను పురస్కరించుకొని ఒక ప్రోమో విడుదల చేశారు. అందులో రాజ్యానికి సంబంధించిన స్కిట్ చేశారు బుల్లెట్ భాస్కర్. భాస్కర్, ఫైమా రాజు రాణి గా చేశారు. ఫైమా చెబుతూ పక్కరాజ్యం వారు మనపై దండెత్తి వస్తారు కదా! మీరు పారిపోవడానికి ఒక సొరంగం తవ్వండి అంటూ రాజైన భాస్కర్ కి చెబుతుంది. ఇక ఆమె మాటలకు విసిగిపోయిన భాస్కర్ అసలు విషయం బయట పెట్టాడు.. సొరంగం.. సొరంగం.. అంటూ ఒకడిని ఎంకరేజ్ చేశారు.. వాడేం చేశాడు ఆ సొరంగంలో నుంచి పక్క రాజ్యానికి వెళ్లిపోయాడు అంటూ సెటైర్లు పేల్చాడు.bullet bhaskar father about rashmi gautam love story in extra jabardasth show , bullet bhaskar, rashmi gautham, extra jabardasth, rashmi, sudheer, buller bhaskar father - Telugu Buller Bhaskar, Bullet Bhaskar, Rashmi, Rashmi

ఇక భాస్కర్ ఆవేశంలో అన్నా అందరూ కలిసి సుదీర్ ని ఎంకరేజ్ చేశారని, అందుకే అందరూ కలిసే సుధీర్ ని పంపించేశారు అనే విషయాన్ని వెల్లడిస్తూ పెద్ద బాంబు పేల్చాడు భాస్కర్ . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారింది.

<iframe width=”853″ height=”480″ src=”https://www.youtube.com/embed/rBTMo-COFO4″ title=”Extra Jabardasth Latest Promo – 2nd September 2022 – Rashmi Gautam,Kushboo,Indraja,Bullet Bhaskar” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

Read more RELATED
Recommended to you

Latest news