రేపు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

-

రేపు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీపొట్టి శ్రీరాములు.. నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పెన్నానది పై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎం జగన్‌… ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.

cm jagan
cm jagan

ఈ నెల 6వ తేదీన జాతికి అంకితం చేయనున్నారు సీఎం వైయస్‌ జగన్‌. ఇక ఈ పర్యటన కోసం రేపు ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్‌. 10.40 గంటలకు సంగం చేరుకోనున్న ముఖ్యమంత్రి… 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు నెల్లూరు బ్యారేజ్‌ సైట్‌కు చేరుకుంటారు. 1.50 – 2.20 గంటల మధ్య నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని ప్రారంభించనున్న సీఎం జగన్‌.. 2.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news