బిగ్ బాస్ 6: అప్పుడే ఆ ఇద్దరి కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్ మొదలు.. ఎంతవరకు వెళ్తుందో..?

-

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య పెట్టే టాస్కులు, గొడవలు, ప్రేమలు, కహానీలు , ఆఖరికి అడల్ట్ సన్నివేశాలు కూడా అప్పుడప్పుడు మనం చూసే పరిస్థితి ఏర్పడుతుంది . ఇక ఈ క్రమంలోనే కొంతమంది బిగ్ బాస్ పై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తే.. మరి కొంత మంది బిగ్ బాస్ షో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది రివ్యూల కోసం బిగ్ బాస్ షో చూస్తే మరి కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం ఈ షో చూస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఎప్పటిలాగే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కూడా ఇక మొదలయ్యి వారం కూడా కాలేదు అప్పుడే ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్ సృష్టించారు బిగ్ బాస్ నిర్వహకులు.

ఇకపోతే అంతకుముందు మోనాల్ – అఖిల్ , రాహుల్ – పునర్నవి ల మధ్య లవ్ ట్రాక్ నడిపి ఆడియన్స్ ను అలరిస్తే ఆరో సీజన్లో మాత్రం బిగ్ బాస్ లో క్లాష్, మాస్ , ట్రాష్ అనే టాస్క్ పెట్టేశారు, ఇక ఈ సందర్భంలోనే ఓటింగ్ అంతా ఫైనలై సూర్య, బాలాదిత్య , శ్రీహన్ క్లాష్ సభ్యులుగా, రేవంత్ , గలాట గీతూ, ఇనయ ట్రాష్ సభ్యులుగా ఎంపికయ్యారు. అయితే ఇందులో ముందుగానే కొబ్బరి బోండాలు ఆట కూడా ఆడారు. ఇందులో ఇనయ పై ఆదిరెడ్డి విజయం సాధించి క్లాస్లో కొనసాగగా.. ఇదే ఆటలో ఓడిపోయిన శ్రీహాన్ మాస్ సభ్యుడిగా మారాడు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదే సమయంలో ఆర్జె సూర్య , కార్తీక దీపం నటి కీర్తి భట్ తో పులిహోర కలిపే ప్రయత్నం చేస్తూ కనిపించారు..

కీర్తి వేసుకున్నటువంటి టీ షర్టు లాంటిదే తన దగ్గర కూడా ఉందని తెలిపాడు. మరి వేసుకోవచ్చు కదా అని కీర్తి అడిగితే రేపు వేసుకుంటాను అని, ఒకవేళ ఎవరైనా అడిగితే నీదే అని చెప్పు అని ఆమెతో అంటాడు. ఇలా మాటల్లో మాట కలిపి పిచ్చి అని కీర్తిని పిలుస్తాడు సూర్య.. అప్పుడు కీర్తి ఏమన్నావ్ అని అడగగా.. పిచ్చి అని అన్నాను అంటూ సూర్య వదిలిచ్చాడు.. అంతే కాదు సూర్య పిచ్చి అని పిలవడం నాకు చాలా ఇష్టమని చెప్పడంతో.. కీర్తి కూడా ఆ మాట అంటే నాకు కూడా చాలా ఇష్టం అంటూ సిగ్గు పడిపోయింది. ఇది చూసిన ప్రేక్షకులు వీరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.. అప్పుడే లవ్ ట్రాక్ మొదలు పెట్టేసారా అంటూ మరొకవైపు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news