కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇవాళ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2019ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవే..
– వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవు.
– నవీన భారత రూప కల్పనకు ప్రణాళికలు. 2014-15 తో పోల్చితే ఆహార భద్రతకు రెట్టింపు నిధులు.
– 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే టార్గెట్.
– గత ఐదేళ్లలో పన్ను విధానం, రుణాల ఎగవేత నియంత్రణలో పలు విప్లవాత్మక మార్పులు.
– 1.85 లక్షల డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ… ప్రస్తుతం 2.5 లక్షల డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగింది.
– ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్ లో మార్పులు వచ్చాయి.
– ప్రధానమంత్రి సడక్ యోజన, ఉడాన్, పారిశ్రామిక కారిడార్, రవాణా మార్గాలు, రైల్వేలకు మార్గాలు.
– ఉడాన్ పథకం ద్వారా చిన్న చిన్న పట్టణాలకు విమానయాన సౌకర్యం.
– దేశవ్యాప్తంగా 657 కిమీల మెట్రో మార్గం పూర్తి.. మరో 300 కిమీల మెట్రో మార్గానికి అనుమతులు లభించాయి. దీంతో త్వరలోనే మెట్రో రైలు స్వరీసులు పెరగనున్నాయి.
– జలమార్గం రవాణాకు కూడా ప్రాధాన్యం.
– పీపీపీ పద్ధతిలో రైల్వేలో 50 లక్షల కోట్ల పెట్టుబడికి ఆహ్వానం.
– ఒకే దేశం.. ఒకే గ్రిడ్ విధానం ద్వారా విద్యుత్ సరఫరా.
– ఎలక్ట్రిక్ వాహన తయారీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు.
– సామాన్యులకు అందుబాటులోకి ఇళ్ల ధరలు.
– త్వరలో ఆదర్శ అద్దె విధానం.
– ఎంఎస్ఎంఈలకు కోటి వరకు లోన్ సౌకర్యం.
– ఒకే కార్డుతో బస్ చార్జీలు, పార్కింగ్ రుసుము చెల్లించే విధానం.
– ప్రధాన మంత్రి కర్మయోగి మాన్ ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్ పథకం.
– విదేశీ పెట్టుబడుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం.
– రేడ్ టేపిజం నియంత్రణకు చర్యలు.
– మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అంత్యోదయ పథకం.
– స్టాక్ మార్కెట్ లలో ఎన్ఆర్ఐల పెట్టుబడులకు వెసులుబాటు. వాటిని విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు.
– త్వరలోనే అందరికీ ఇళ్లు. కొనసాగుతున్న 1.9 కోట్ల ఇళ్ల నిర్మాణం.
– 2022 నాటికి అన్ని ఇళ్లకు విద్యుత్, గ్యాస్ సరఫరా
– 1.25 లక్షల కిమీ మేర రహదారుల ఆదునికీకరణ
– జీరో బడ్జెట్ వ్యవసాయం. అంటే పెట్టుబడులు లేకుండా వ్యవసాయం. దీనికోసం ఇప్పటికే రైతులకు శిక్షణ.