హర్షిత స్కూల్ నందిగం రాణికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హర్షిత విద్యాసంస్థల నిర్వాహకులు నందిగం రాణి ఆస్తుల జప్తు కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం తడికలపూడిలో హర్షిత విద్యాసంస్థలను నిర్వహిస్తున్న నందిగం రాణి ఆస్తుల జప్తు కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆస్తులను దావా సొమ్ముకు హామీగా జప్తు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు విజయవాడ 8వ అదనపు జిల్లా జడ్జి కోర్డు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి. ఆస్తుల విక్రయం, కొనుగోలును నిషేధిస్తు ఆదేశాలు ఇచ్చింది కోర్టు.
ఏ రూపంలోనూ ఆస్తులను బదలాయింపునకు వీల్లేదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని టోపీ పెట్టినట్టు నందిగం రాణిపై అభియోగాలు వచ్చాయి. నందిగం రాణి దంపతులు హైదరాబాద్‌లో ఇప్పటికే ఓసారి జైలుశిక్ష అనుభవించారు. నందిగం రాణి తమ వద్ద అప్పుగా తీసుకున్న సొమ్మును ఎగవేశారంటూ చింతగుంట మేరీ, ఎర్రపోతు శ్రీనివాసరావు విజయవాడలోని న్యాయస్థానాలను ఆశ్రయించటంతో విచారణ జరిపి తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. ఇక విచారణ జరిపిన న్యాయ స్థానాలు ఆస్తుల జప్తునకు వేర్వేరుగా రెండు ఆదేశాలు ఇచ్చింది కోర్టు.