మరో భారత క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించారు. భారత బౌలర్ ఈశ్వర్ పాండే క్రికెట్ కు గుడ్ బై పలికాడు. మధ్యప్రదేశ్ కు చెందిన 33 ఏళ్ల పాండే, IPL, రంజీ ట్రోఫీలో రాణించాడు. 2014లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్ లో ఇండియా- ఏ జట్టుకు ఆడాడు.
ఇక IPL లో చెన్నై, పూనే తరుపున ఆడిన పాండే 25 మ్యాచ్ లో 18 వికెట్లు పడగొట్టాడు. 75 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 263 వికెట్లు, 945 రన్స్ చేశాడు. అయితే..ఎంత ఆటతీరును కనబరిచినా… టీమిండియా మెయిన్ జట్టులో స్థానం దక్కకపోవడం… ఐపీఎల్ లోనూ.. ఎక్కువ రేట్ దక్కకపోవడం.. ఇతర కారణాల వల్ల ఈశ్వర్ పాండే.. క్రికెట్ కు గుడ్ బై పలికాడని సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Super Thanks for all your strides in Yellove, Ishwar Pandey! #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/W61wYBgkDU
— Chennai Super Kings (@ChennaiIPL) September 12, 2022