SSMB 29 : మహేష్ తో సినిమాపై రాజమౌళి బిగ్ అనౌన్స్ మెంట్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి సినిమా విషయం ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. వాస్తవంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో డా.కే.ఎల్.నారాయణ ఈ కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి దాదాపు మూడేళ్ళ క్రితమే కమిటయ్యారని తెలిసిందే.

ఈ సినిమాని మహేష్ బాబు కెరీర్ లో 25 వ సినిమాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని అనుకున్నారు. కాని అది సాధ్యం కాలేదు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కిస్తున్న రాజమౌళి ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో చేయబోతున్నట్టు రీసెంట్ గా స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాపై రాజమౌళి బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. మహేష్‌ బాబు SSMB 29 సినిమా తనతోనే తీస్తున్నారని ప్రకటించారు. ఈ సినిమా గ్లోబెట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ట్రెండింగ్‌ లోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news