ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలకు సంబంధించి ప్రతీ నెలా కూడా మార్పులు చేస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరలను తగ్గిస్తారు. మరి కొన్ని సార్లు పెంచుతాయి. ఆగస్టు లో అయితే రూ.36 మేర తగ్గించాయి.
సెప్టెంబర్ లో కూడా రూ.100 వరకు తగ్గించాయి. జూలై నెలలో గ్యాస్ ధరను రూ.50 పెంచిన తర్వాత మళ్ళీ ధరలు పెరగలేదు. స్థిరంగానే ఉంచాయి. ఈసారి పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 14 కేజీల సిలిండర్ ధరను కచ్చితంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గిస్తాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 1న ఆయిల్ కంపెనీలు ప్రకటించిన రేట్లు చూస్తే.. ఢిల్లీలో రూ.1,885 వుంది. ముంబైలో రూ.1,936.50 నుంచి రూ.1,844కు తగ్గింది. హైదరాబాద్‌లో 19 కేజీల సిలెండర్ రూ.2,099.5గా ఉంది. విజయవాడలో రూ.2034, కోల్‌కతాలో రూ.2,095.50 నుంచి రూ.1,995.50కు తగ్గింది. ఇంపోర్ట్ పారిటీ ప్రైస్ ఫార్ములా ఆధారంగా గ్యాస్ సిలెండర్ ధరలు ఉంటాయి. క్రూడాయిల్ ధర, సముద్రపు ఫ్రయిట్ ఖర్చులు, ఇన్సూరెన్స్, కస్టమ్ డ్యూటీ మొదలైనవన్నీ కూడా కలిసి ఉంటాయి. దీని ఆధారంగా రేటు ఫిక్స్ అవుతుంది.