తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్ తగులనుంది. త్వరలోనే భారీగా పెరగనున్నాయి లిక్కర్ ధరలు. తెలంగాణలో లిక్కర్ రేట్లను మళ్లీ పెంచేందుకు కేసీఆర్ సర్కార్ సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది. దసరా సందర్భంగా మందు రేట్లు పెంచాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఓవైపు రాష్ట్రంలో మద్యం కొరత, మరోవైపు పండగ డిమాండ్ ని బట్టి ప్రభుత్వం ధరల పెంపుపై నిర్ణయం తీసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. డిమాండ్ ని బట్టి, 10 నుంచి 30% వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం.
అటు మద్యం తయారీ ధరల పెంపు కోసం డిస్టలరీలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి. పండగ సీజన్ ను ఆసరాగా చేసుకుని, కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. డిస్టలరీల నిర్వాహకులు వారి డిమాండ్ ను నెరవేర్చుకోవడానికి పక్కా ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. దసరా సీజన్ ను ఆసరాగా చేసుకొని కృత్రిమ కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, పరిస్థితిని ఎక్సైజ్ శాఖ నిశితంగా పరిశీలించడంతో వారి బాగోతం బయటపడింది.