ఇండియన్‌ ఆర్మీలో టీచర్‌ పోస్టులు..ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్‌ ఆర్మీ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఇండియన్‌ ఆర్మీ ఆర్‌ఆర్‌టీ 91,92 కోర్సుల్లో భాగంగా జూనియర్ కమిషన్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు. ఇక పోస్టుల వివరాలను చూస్తే.. మొత్తం 127 ఖాళీలు వున్నాయి. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది చూస్తే…పండిట్ 108, గుర్ఖా రెజిమెంట్ పండిట్ 5, గ్రంథి 8, మౌల్వీ (సున్నీ) 3, మౌల్వీ (షియా)- లడఖ్ స్కౌట్స్ 1 వున్నాయి.

అలానే పాడ్రే 2, బొథ్ మాంక్ లడఖ్ స్కౌల్స్ (మహాయాన) లో ఒక ఖాళీ వుంది. ఇక వయస్సు వివరాలను చూస్తే.. 25 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. ఫిజికల్ స్టాండర్డ్, ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చేసుకొనేందుకు నవంబర్ 6, 2022 చివరి తేదీ. పూర్తి వివరాలను https://www.joinindianarmy.nic.in/Authentication.aspx లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news