వెనిజులాలో భారీ వరదలు.. 22 మంది మృతి!!

-

దక్షిణ అమెరికాలోని వెనిజులాలో భారీగా వరదలు పోటెత్తాయి. లాస్ టెజెరియాస్ నగరంలో కొండచరియలు విరిగిపడి విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందగా.. 50 మంది వరకు గల్లంతయ్యారు. కొన్ని వందల ఇళ్లు కూలిపోయాయి. ఈ మేరకు దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టామని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

వెనిజులా-వరదలు
వెనిజులా-వరదలు

30 ఏళ్ల తర్వాత లాస్ టెజేరియాస్‌లోని నదిలో నీటిమట్టం పెరిగిందన్నారు. ఈ క్రమంలోనే భారీగా వరదలు వచ్చాయని ఓ అధికారి తెలిపారు. 1999లో వర్గాస్‌లో జరిగిన కొండచరియలు విరిగిపడి 10 వేల మంది మరణించారు. విపత్తు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించడంతో లాస్ టెజేరియాస్‌లో భారీ సంఖ్యలో రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చేశారు. 8 గంటల్లోనే భారీ విపత్తు వచ్చిందని వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news