బోయినపల్లి అభిషేక్ రావును కోర్టులో హాజరుపరిచిన సిబిఐ

-

ఢిల్లీ డిక్కర్ స్కామ్ లో సిబిఐ దూకుడు పెంచింది. హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్ లోని ప్రదేశాలలో శుక్రవారం ఉదయం నుంచి మరోసారి దాడులు నిర్వహించింది. రాబిన్ డిస్టీలర్స్ లో డైరెక్టర్ అభిషేక్ రావును ఆదివారం రాత్రి సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. అతని నుంచి పలు కీలక డాక్యుమెంట్స్ సేకరించింది సిబిఐ. హైదరాబాద్ నుంచి తొలి అరెస్ట్ కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.

ఇప్పటికే ఈ కేసుతొ సంబంధమున్న విజయ్ నాయర్ ను సిబిఐ అరెస్టు చేసింది. ఇప్పుడు తాజాగా హైదరాబాదులో బోయినపల్లి అభిషేక్ రావును అదుపులోకి తీసుకుంది. బోయినపల్లి అభిషేక్ రావును సిబిఐ కోర్టులో హాజరు పరిచింది. జడ్జి ఎంకెె నాగ్ పాల్ ముందు అభిషేక్ ను హాజరు పరిచి కస్టడీకి ఇవ్వాలని కోరారు అధికారులు. ఇండో స్పిరిట్ నుంచి రూ. 3.85 కోట్లు అక్రమంగా అభిషేక్ ఖాతాలోకి వచ్చాయని సిబిఐ ఆరోపిస్తోంది. దీంతో అభిషేక్ ను విచారించేందుకు కోర్టు సిబిఐ కి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news