ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై “ఉక్కు తీగలతో సస్పెన్షన్ వంతెన” నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలిసారిగా వినూత్న శైలిలో వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. 30 నెలల్లో 1082.56 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ఇలాంటి తరహా వంతెనల్లో, దేశంలో తొలి వంతెన గా, ప్రపంచంలో రెండవ వంతెనగా ప్రసిధ్ది కానుంది. చాలా తక్కువ ఖర్చు తోపాటు, ఆకట్టుకునే రీతిలో ఉండేలా వంతెన నిర్మాణ ఆకృతి ని రూపొందించడం జరిగిందని వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణంలో అనేక ఆకట్టుకునే విశేషాలు ఉన్నాయని.. ఈ వంతెన నిర్మాణం వల్ల హైదరాబాద్, తిరుపతి మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. నది పై గాజు తో కప్పబడిన పొడవైన నడకమార్గం కూడా ఏర్పాటు కూడా చేయనున్నట్లు తెలిపారు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.