వంట చేసే ముందు గుడ్డుని కడగచ్చా..?

-

గుడ్ల తో ఎన్నో రకాల రెసిపీస్ ని తయారు చేసుకోవచ్చు. ఆమ్లెట్ మొదలు కూర వంటివి చాలా మంది చేస్తూఉంటారు. అయితే వండేటప్పుడు గుడ్లని కడుగుతున్నారా..? అసలు వండేటప్పుడు గుడ్లని కడగవచ్చా అనే విషయాన్ని చూద్దాం.

గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ లోపంతో బాధపడే వాళ్లు గుడ్లు తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది. కానీ గుడ్లను కడిగిన తర్వాత తినడం చాలా హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మామూలుగా మనం ఏదైనా కూరగాయల కానీ కానీ పండ్లను కొనుగోలు చేసిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత తింటుంటాం. దీనిని మీరు గుడ్ల విషయంలో ఫాలో అయితే సమస్యలు తప్పవు. గుడ్లను కడిగి తింటే బ్యాక్టీరియా తొలగిపోతుందని చాలా మంది అంటూ ఉంటారు.

గుడ్లని కడిగితే కలిగే నష్టాలు:

నిజానికి గుడ్లను కడగడం వల్ల నష్టాలు వస్తాయి. గుడ్లను కడిగితే గుడ్లు పాడైపోయే అవకాశం ఉంది.
గుడ్లు పైన క్యూటికల్స్ మరియు బ్లూమ్ ఉంటాయి. ఇది బ్యాక్టీరియా మరియు గాలి నుండి రక్షించడానికి హెల్ప్ అవుతుంది.
కానీ గుడ్లని కడిగితే ఈ పూత తొలగిపోతుంది. దానితో గుడ్లు పాడవుతాయి. పైగా నీటితో కడగడం వల్ల గుడ్డు మీద ఉండే బ్యాక్టీరియా లోపలకి వెళ్ళిపోతుంది దీని వల్ల మరింత హాని కలుగుతుంది. సూపర్ మర్కెట్స్ వంటి చోట అయితే గుడ్లను కడిగే సెల్ చేస్తారు. ఒకవేళ మీరు కోళ్ల ఫారం నుండి గుడ్లని కొంటుంటే వేడినీళ్లతో వాటిని కడగచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news