కార్గిల్‌కు సమీపంలో పెద్ద ఎత్తున పాక్ సైనికులు, కాశ్మీర్ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం భారత సైనికులకు తెలియదు. కానీ ఆ భగవంతుడు మన పక్షాన ఉన్నాడేమో.. కార్గిల్ సెక్టార్‌కు వెళ్తున్న సైనికులకు ఓ పశువుల కాపరి ఎదురు వచ్చాడు.
సరిగ్గా 20 ఏళ్ల కిందట జూలై 26వ తేదీన.. కార్గిల్ యుద్ధంలో భారత్ పాక్‌పై అఖండ విజయాన్ని సాధించి మువ్వన్నెల పతాకాన్నికార్గిల్ గడ్డపై ఎగుర వేసింది. భారత్ కళ్లు కప్పి దొడ్డి దారిన పాక్ సైనికులు, కాశ్మీర్ ఉగ్రవాదులు మన భూభాగంలోకి ఆక్రమించారు. అయితే భారత్ వారిని చాలా చాకచక్యంగా కనుగొని దాడులు చేపట్టింది. దీంతో పాక్ సేనలు తోకముడిచాయి. అయితే పాక్ సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారన్న సమాచారం కనుగొనేందుకు కార్గిల్‌లో భారత సైనికులకు ఒక గొర్రెల కాపరి ఎంతో సహాయం చేశాడు. నిజానికి ఆ రోజు ఏం జరిగిందంటే…
కార్గిల్ కు అవతలి వైపు ఉన్న భూభాగంలో సాధారణంగా చలికాలం సైనికులు ఎవరూ ఉండరు. భారత్, పాక్ దేశాలకు చెందిన సైనికులు ఆ స్థావరాలను ఖాళీ చేసి వెళ్లిపోతారు. మళ్లీ చలికాలం తగ్గగానే ఆయా స్థావరాలకు చేరుకుంటారు. అయితే అదనుగా భావించిన పాక్ సైనికులు, కొందరు కాశ్మీర్ ఉగ్రవాదులతో కలిసి నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. కార్గిల్, లదాక్‌లను ఆక్రమించుకుని కాశ్మీర్ సమస్యను పెద్దదిగా చేయాలన్న ఆలోచనతోనే వారు భారత భూభాగంలోకి వచ్చారు. అయితే అక్కడ భారత సైనికులు లేకపోవడంతో మనకు వారు వచ్చినట్లు తెలియదు. దీంతో ఆ సైనికులు, ఉగ్రవాదులు అప్పటికే భారత్‌కు చెందిన పలు కీలక స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడికి గస్తీ కోసం పంపబడిన పలువురు సైనికులు తిరిగి రాలేదు. దీంతో మరో బృందాన్ని అప్పటి లెఫ్టినెంట్ కల్నల్ సౌరవ్ కాలియా నేతృత్వంలో పంపారు. అయినా వారూ తిరిగి రాలేదు. దీంతో భారత సైన్యానికి అనుమానం వచ్చింది. వెంటనే కొందరు సైనికులు కార్గిల్ సెక్టార్‌కు వెళ్లారు.
అయితే కార్గిల్‌కు సమీపంలో పెద్ద ఎత్తున పాక్ సైనికులు, కాశ్మీర్ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం భారత సైనికులకు తెలియదు. కానీ ఆ భగవంతుడు మన పక్షాన ఉన్నాడేమో.. కార్గిల్ సెక్టార్‌కు వెళ్తున్న సైనికులకు ఓ పశువుల కాపరి ఎదురు వచ్చాడు. అతన్ని భారత జవాన్లు ప్రశ్నించగా.. అతను పూసగుచ్చినట్లు అన్ని వివరాలు చెప్పాడు. కార్గిల్ సెక్టార్‌కు సమీపంలో ఎంత మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు ఉన్నారు, వారి వద్ద ఏమేం ఆయుధాలు ఉన్నాయి.. తదితర సమాచారాన్ని ఆ పశువుల కాపరి భారత జవాన్లకు చెప్పాడు. అలాగే తన గేదె తప్పిపోతే అక్కడికి వెతుక్కుంటూ వెళ్లానని.. అక్కడ కొందరు ఆయుధాలతో ఉన్నారని, వారు తన గేదెను చంపి తిన్నారని కూడా ఆ కాపరి సైనికులకు తెలిపాడు. దీంతోపాటు 50 నుంచి 60 మంది భారత సైనికుల మృతదేహాలు అక్కడ ఉన్నాయని అతను తెలిపాడు.
ఈ క్రమంలో అలర్ట్ అయిన భారత సైన్యం మెరుపు దాడి చేసి పాక్ సైనికులు, ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ తరువాత పాక్ ప్లాన్ ను పసిగట్టిన భారత జవాన్లు పాక్ ఆక్రమించుకున్న ఒక్కో భూభాగానికి వెళ్లి పాక్ సైనికులను చిత్తు చేస్తూ తిరిగి ఆ స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో జూలై 26వ తేదీన యుద్ధం నుంచి తప్పుకుంటున్నట్లు పాక్ ప్రకటించింది. దీంతో ఆ రోజు భారత్ కార్గిల్ యుద్ధంలో గెలవగా.. అప్పటి నుంచి ఆ రోజును కార్గిల్ విజయ్ దివస్‌గా భారత్ జరుపుకుంటోంది..!