SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్..ఫిజికల్‌ టెస్టులకు అర్హత సాధించాలంటే ఇలా చేయాల్సిందే

-

ఎస్‌ ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌. ఎస్‌ ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో పాసై.. ఫిజికల్‌ టెస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్‌ 2 అప్లికేషన్లను అప్ లోడ్‌ చేయాలని పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు.. సూచనలు చేసింది.

అక్టోబర్‌ 27 వ తేదీ నుంచి నవంబర్‌ 10 వ తేదీ వరకు ఈ అప్లికేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఫిజికల్‌ టెస్టులు ప్రతి ఒక్కరికి ఒక్కసారి మాత్రమే జరుగుతాయని.. వాటి ఫలితాలనే అన్ని పోస్టులకు పరిగణనలోకి తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. TSLPRB వెబ్‌ సైట్‌ ఓ అప్లికేషన్లను అప్ లోడ్‌ చేయాలని పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు.. సూచనలు చేసింది.

కాగా.. నిన్న ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.  పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ ఫలితాలను వెల్లడించింది.సివిల్‌ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, రవాణా కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news