అదానీ పై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదు : YS జగన్

-

అదానీ పై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదు అని మాజీ సీఎం YS జగన్ అన్నారు. ముఖ్యమంత్రులను పారిశ్రామిక వేత్తలు కలుస్తారు. పారిశ్రామిక వేత్తలను తీసుకు రావటం కోసం ప్రతి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఐదేళ్ల కాలంలో అనేక అనేక మార్లు అదానీ కలిశారు. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. కలవటంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ, సేకి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందాలు జరిగాయి మూడో వ్యక్తి లేరు.

అందుకే అసత్య ప్రచారంపై పరువు నష్టం నోటీసులు దాఖలు చేస్తున్నాను. టీడీపీకి కోసం దాని అనుకూల మీడియా ఈ విష ప్రచారాలు నాపై చేస్తోంది. ఇక రాష్ట్రంలో 3 క్వార్టర్స్ పూర్తయినా విద్యా దీవెన బకాయిలు చెల్లించటం లేదు. కళాశాలలో చదవాల్సిన విద్యార్దులు పొలాల్లో తల్లిదండ్రులతో ఉంటున్నారు. వాలంటీర్లను మోసం చేశారు. ఎన్నికల సమయంలో 10 వేలు ఇస్తామని గెలిచాక పక్కన పెట్టేశారు. సంపద సృష్టి అంటే రాష్ట్రానికి ఉన్న ఆదాయం పెంచే విధానం. వైసీపీ హయంలో ఇది జరిగింది అని జగన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news