మీ పిల్లలు పొడవవ్వాలా..? అయితే వీటిని ఇవ్వండి.. ఎన్నో లాభాలు కూడా..!

-

కొంతమంది పిల్లలు హైట్ తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఆహారాన్ని తీసుకుంటే త్వరగా పొడుగ్గా ఎదుగుతారు. పైగా ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది. పిల్లలకి వీటిని రెగ్యులర్ గా ఇస్తే వారి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పొడుగ్గా మారాలంటే ఇవి చక్కగా పనిచేస్తాయి. రాగులను నీళ్ళల్లో నానబెట్టి మొలకెత్తించాలి. మొలకెత్తిన రాగుల్ని వేయించి పౌడర్ కింద చేసుకోవాలి. ఆ రాగి పొడిని పాలతో లేదంటే నీళ్లతో కానీ కలిపి కొద్దిగా బెల్లం వేసి ఉడికించాలి. వీటిని పిల్లలకు ఇస్తే పోషకాలు బాగా అందుతాయి. హెల్తీగా ఉండడానికి అవుతుంది. అలాగే గోధుమ రవ్వలో రకరకాల కూరగాయ ముక్కల్ని వేసి ఉడికించి కొద్దిగా నెయ్యి వేసి పిల్లలకి జావా లాగా ఇవ్వచ్చు.

దీని వలన కూడా పోషకాలు బాగా అందుతాయి. హెల్త్ బావుంటుంది. బియ్యం నూకలని మెత్తగా ఉడికించి జావ చేసి కూడా వారికి ఇవ్వచ్చు. ఇందులో పెరుగు కలిపి కొద్దిగా నెయ్యితో తాలింపు వేసి ఇవ్వచ్చు. పిల్లలు దీనిని తీసుకోవడం వలన జీర్ణశక్తికి చాలా మంచి జరుగుతుంది. అలాగే హెల్త్ కూడా బాగుంటుంది. పిల్లలు బావుండడానికి జొన్నలతో జావ చేయొచ్చు. జొన్నలని రవ్వలాగ చేసుకుని కూరగాయ ముక్కలు పప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ జావని పిల్లలకి ఇస్తే పిల్లల హెల్త్ బావుంటుంది.

పిల్లలకు బార్లీ జావ కూడా పెట్టొచ్చు. బార్లీ గింజల్ని నీళ్లలో నానబెట్టి పాలతో లేదంటే నీళ్లతో ఉడికించి పిల్లలకు టేస్టీగా దీనిని ఇవ్వచ్చు. పిల్లల హెల్త్ కి సగ్గుబియ్యం జావ కూడా మంచిదే. అలాగే ఓట్స్ తో కూడా మనం జావ చేసి ఇవ్వచ్చు ఇది కూడా పిల్లలకి నచ్చుతుంది. దీనిని మనం స్పైసీగా చేయొచ్చు లేదంటే తియ్యగా చేయొచ్చు ఎలాగైనా పిల్లలకి నచ్చుతుంది. సజ్జలతో జావ చేస్తే కూడా బాగుంటుంది. సజ్జలను ఉడికించి కూరగాయ ముక్కలు వేసి పిల్లలకు ఇవ్వచ్చు. ఇలా వీటిని మీరు మీ పిల్లలకి పెడితే హైట్ పెరగడమే కాకుండా అనేక లాభాలను పిల్లలు పొందుతారు.

Read more RELATED
Recommended to you

Latest news