BREAKING : ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, తిరుపతి, నందకుమార్ లను పోలీసులు పూర్తి సాక్షాలతో పట్టుకున్నారు.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయిన రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయగా.. దాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఇక ఈ ఎపిసోడ్ అనంతరం.. రాత్రికి రాత్రి…. ప్రగతి భవన్‌కు వెళ్లి.. కేసీఆర్ భేటీ అయ్యారు.
నిన్న రాత్రి ప్రగతి భవన్ లోనే ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస చేశారు. ఇక ఇవాళ ఈ మొయినాబాద్ ఎపిసోడ్ పై ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. బేరసారాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని ఆ నలుగురు ఎమ్మెల్యేలు చెబుతుంటడంతో… సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నట్లు సమాచారం అందుతోంది.