ఇండిగో విమానంలో మంటలు.. టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఫెయిల్

-

ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెనక ఉన్న స్పైస్‌జెట్‌ విమాన పైలట్‌ గుర్తించి అధికారులకు సమాచారమందించగా.. వారు అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మెుత్తం 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి అందులోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరగగా.. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఘటనపై డీజీసీఏ స్పందించింది. విమానం రెండో ఇంజిన్​లో తలెత్తిన వైఫల్యాల వల్ల మంటలు చెలరేగినట్లు తెలిపింది. ఈ సమయంలో భారీ శబ్దాలు వచ్చాయని పేర్కొంది. విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతి నిరాకరించినట్లు వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news