మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదం.. నేడు ఘటనాస్థలికి మోదీ

-

వందల కుటుంబాల్లో విషాదం నింపింది గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదం. ఇప్పటికే ఈ ప్రమాదంలో 130కి పైగా మృతి చెందారు. మరో వంద మంది కోసం ఇంకా అధికారులు గాలింపు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిలో తొమ్మిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఆ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.

ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలిపారు. గుజరాత్ పర్యటనలోనే ఉన్న మోదీ ఇవాళ మోర్బీకి వెళ్లనున్నారు. అక్కడ కేబుల్ బ్రిడ్జి కూలిన స్థలాన్ని పరిశీలించనున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో.. ఎంత మేన నష్టం వాటిల్లిందో స్వయంగా అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోమవారం రోజున సర్దార్ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతిని పురస్కరించుకుని మాట్లాడిన ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. తాను కేవడియాలోనే ఉన్నా తన మనసంతా మోర్బీ బాధితుల గురించే ఆలోచిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గుండె నిండా భరించలేని బాధ ఉన్నా తప్పక విధులు నిర్వహించాల్సి వస్తోందని భావోద్వేగానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news