సమంత అలా చేస్తుందనుకోలేదు.. ఉన్ని ముకుందన్..!

-

సమంత తాజాగా నటించిన చిత్రం యశోద. ఈ సినిమా నవంబర్ 11వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన పొందింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేపట్టారు చిత్ర బృందం. అందులో నటీనటులు పాల్గొంటూ తమ సినిమా పై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. హరి హరీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. మరొక పాత్రలో ఉన్ని ముకుందన్ నటించాడు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తను ఇప్పటివరకు మూడు సినిమాలు చేశానని, అందులో అన్నీ కూడా మంచి పాత్రలేనని తెలిపాడు. ఇప్పుడు యశోద చిత్రంలో నటించానని .. సమంత చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్ అని ఆమెపై పొగడ్తల వర్షం కురిపించాడు. కథ ఏంటి? అందులో పాత్ర ఏంటి? అన్న విషయాలే తాను పట్టించుకుంటానని కూడా తెలిపాడు. డైరెక్టర్ హరి హరీష్ కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేసాను. ప్రస్తుతానికి నా క్యారెక్టర్ గురించి ఎక్కువగా చెప్పలేను.. ఎందుకనేది సినిమా చూస్తేనే మీకు అర్థం అవుతుంది అంటూ తెలిపాడు.

తన పాత్ర కోసమే ఈ కథ ఎంచుకున్నాను అని కూడా తెలిపాడు. ప్రస్తుతం తన పాత్ర గురించి సస్పెన్స్ లో ఉండనివ్వండి అని కూడా చెప్పాడు. మరి సమంత గురించి మాట్లాడుతూ.. సమంత అంకితభావం ఉన్న నటి మాత్రమే కాదు ఎంతో కష్టపడే తత్వం ఉన్న గొప్ప వ్యక్తి .. తన పాత్ర కోసం సమంతా ఎంతగానో ప్రిపేర్ అయ్యేది . ఫైట్స్ బాగా చేయడమే కాకుండా యాక్షన్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. సెట్లో ఇతర ఆర్టిస్టులతో కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది. ఒక సన్నివేశం చేసేటప్పుడు ఎలా చేస్తే బాగుంటుందని ఐడియా డిస్కషన్ కూడా చేస్తుందని తెలిపారు. అయితే సమంత మయోసిటిస్ బారిన పడ్డ విషయం తనకు తెలియదని, సమంత చెప్పకుండా ఇలా దాచేస్తుందని అనుకోలేదంటూ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. త్వరలోనే ఆమె కోలుకొని వస్తారని కూడా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news