తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు రోడ్ షో లో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి మధు గాయపడ్డారు. అయితే రాళ్ల దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పోలీసుల భద్రతా వైఫల్యం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ రౌడీలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి మెరుగ నాగార్జున స్పందిస్తూ.. చంద్రబాబు చెప్పులు, రాళ్లు వేయించుకొని లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. నందిగామలో జరిగింది ఇలాంటి కుట్రలో భాగమేనన్నారు. చంద్రబాబు కబంధహస్తాలలో పవన్ కళ్యాణ్ చిక్కుకున్నారని.. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఆయన నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి నేతలకు సైతం సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలని ప్రశ్నించారు.