OFFICIAL : ”ఆదిపురుష్” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ – సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు వున్నాయి ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టు కొనేలా లేదని , గ్రాఫిక్స్ బాగా లేవని సోషల్ మీడియాలో కొంతమంది ట్రో ల్ చేశారు.

ఇది ఇలా ఉండగా… ఈ నేపథ్యంలోనే.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు బిగ్‌ షాక్‌ ఇచ్చింది ”ఆదిపురుష్” చిత్ర బృందం. అయితే ఆదిపురుష్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరి నుంచి తప్పుకుని.. సమ్మర్ లో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. అయితే…దీనిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ఓం రౌత్‌. ఈ సినిమా పోస్టో పోన్‌ చేస్తున్నామని.. 2023 జూన్‌ 16వ తేదీన రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news