కేవీఎస్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌: 4014 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్‌ లో ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక మనం పూర్తి వివరాలను చూస్తే…దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ కేవీ స్కూళ్లల్లో ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఖాళీగా వున్నాయి.

మొత్తం 4014 పోస్టులను భర్తీ చేస్తున్నారు. హిందీ, ఇంగ్లిష్‌, హిస్టరీ, ఎకనామిక్స్‌, జాగ్రఫీ, ఫిజిక్స్‌ మొదలైన సబ్జెక్ట్స్ లో ఈ ఖాళీలు వున్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ చెయ్యాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ పూర్తి చేసుండాలి. అలానే అనుభవం కూడా తప్పనిసరి.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి నవంబర్‌ 16 చివరి తేదీ. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలను చూస్తే… ప్రిన్సిపాల్ పోస్టులు- 278, వైస్‌ ప్రిన్సిపల్ పోస్టులు- 116, ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు- 7, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు- 22 వున్నాయి. అలానే పీజీటీ పోస్టులు- 1200, టీజీటీ పోస్టులు- 2154, హెడ్ మాస్టర్ పోస్టులు- 237 వున్నాయి. పూర్తి వివరాలను https://kvsangathan.nic.in/ వెబ్‌సైట్‌ లో చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news