బిగ్ బాస్ కామెడీ, రొమాంటిక్ లేవు గురూ.! రేటింగ్ ఢమాల్.!

-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ముందు అనుకున్న విధంగా రేటింగ్ రావడం లేదు. హౌస్ లో మంచిగా ఎంటర్టై్మెంట్ చేసే సూర్య మరియు గలాటా గీతు హౌస్ నుండి వెళ్ళడం తో హౌస్ బోసిపోయింది. వాళ్ళు ఉన్నప్పుడు కొద్దిగా అన్నా నవ్వే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు షో మొత్తం గొడవలతో సీరియస్ గా మారింది. అలాగే సూర్య ఉన్నప్పుడు కొద్దిగా హగ్ సన్నివేశాలు తో రొమాంటిక్ యాంగిల్ ఉండేది. ఇప్పుడు అదీ కూడా లేకుండా పోయింది.

దీనితో చాలా వరకు రేటింగ్ ఢమాల్ అయ్యింది. ఇక అందరూ ఊహించి నట్లు గానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ స్టార్ట్ చేసాడు బిగ్ బాస్. శనివారం ఎపిసోడ్‌లో మంచి కంటెస్టెంట్‌ సాప్ట్ పర్సన్ బాలాదిత్య ని ఎలిమినేట్‌ చేశారు. దీంతో అంతా షాక్‌ అయ్యారు. హౌజ్‌లో ఏం జరుగుతుందనే ఆయోయానికి గురవుతున్నారు.

ఇక ఈ  ఆది వారం మరో  కంటెస్టెంట్‌ని బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయే ఛాన్స్ వుంది.మరో ఎలిమినేట్‌ కంటెస్టెంట్‌ వాసంతి అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అందం తో ఆకట్టుకున్న వాసంతి కూడా వెళ్లిపోతే హోమ్ మరీ దారుణంగా అయ్యే పరిస్థితి ఉంది. దీనితో చాలా మంది మంచి కంటెస్టెంట్‌లను వైల్డ్ కార్డ్ ద్వారా పంపాలని, కోరుతున్నారు. షో యాజమాన్యం కూడా అదే పనిలో వున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news