బ్యాంక్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలా..? కేంద్రం ఏం అంటోంది..?

-

బ్యాంక్ ఖాతా లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని బ్యాంకులు చెప్తూ ఉంటాయి. పైగా ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో కనీస మొత్తం లేనట్టయితే జరిమానా తప్పదు. అదనపు ఛార్జీలు కూడా పడుతుంటాయి. కానీ ఇక నుండి మినిమమ్ బ్యాలెన్స్ ఏమి ఉండకుండా చేసేలా వున్నారు. పూర్తి వివరాలని చూస్తే.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగ్‌వత్ కిషన్‌రావ్ కారడ్ కొన్ని విషయాలని చెప్పారు.

బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో ఈ బ్యాలెన్స్ మెయింటెయిల్ చేయడం రద్దు చేసే అధికారం ఉందని అన్నారు. ఇండిపెండెంట్ బాడీలని, ఫైన్‌లు విధించకుండా చేయాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పైనే బాధ్యత ఉందన్నారు. అయితే కేంద్రం ఏమైనా ఈ మినిమమ్ బ్యాలెన్స్ కోసం నిర్ణయం తీసుకుంటుందా..? ఈ ప్రశ్నకి మంత్రి ఇలా అన్నారు. బ్యాంకులు నిజానికి ఇలాంటి పెనాల్టీలని ఏమి విధించక్కర్లేదు అని అన్నారు. అయితే కస్టమర్లు సేవింగ్స్ అకౌంట్ ద్వారా ఎన్నో లాభాలను పొందుతూ వుంటారు. వారికి బ్యాంకులు కొన్ని రూల్స్ పెడుతూ ఉంటాయి.

అలానే మినిమమ్ బ్యాలెన్స్ ని కూడా తీసుకు వచ్చారు. ఇలా చేస్తే వాళ్ళ అకౌంట్ యాక్టివ్‌ లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. చాలా మందికి ఒకే అకౌంట్ కాకుండా ఎక్కువ అకౌంట్స్ ఉంటున్నాయి. పాత వాటిని మళ్లీ వాటిని వాడటం లేదు. అందుకే అవి డొర్మెంట్ అకౌంట్లుగా అవుతున్నాయి. నిరుపయోగ బ్యాంక్ ఖాతాలు లేకుండా చూసేందుకు మినిమమ్ బ్యాలెన్స్ ని ఉంచుతారు. అయితే మరి భవిష్యత్తులో మినిమం బ్యాలెన్స్ తీసేస్తే సమస్య ఉంటుందా లేదా అనేది చూడాలి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news