వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకట్ తండాలో విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని 10 నెలల బాలుడు మృతి చెందాడు. బాదావత్ మాలు, కవితా దంపతులకు మణికంఠ అనే కుమారుడు ఉన్నాడు.
మాలు అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో ఇంట్లో కొబ్బరికాయ కొట్టారు. అందరూ పూజ పనుల్లో ఉండగా, మణికంఠ కొబ్బరి ముక్క తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుంది. మణికంఠను నెక్కొండ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు.