సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న త్రిష.. ఎమోషనల్ పోస్ట్ ను ఉంచిన భామ..

-

త్రిష ఈ వయసులో కూడా ఎంతో అందంగా కనిపిస్తూ కుర్ర కారు మనసులను దోచేస్తుంది స్టార్ హీరోయిన్గా సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను అభిమానులంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు..

స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న త్రిష దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది దాదాపు ఇప్పటివరకు అన్ని భాషల్లో నటించిన త్రిష.. ఇప్పటివరకు ఆమె అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ మళ్లీ తన కెరీర్ ను నిలబెట్టిన చిత్రాన్ని గుర్తు చేసుకుంది..

1999 నుంచి త్రిష సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది ఇప్పటివరకు దాదాపు 70 చిత్రాల్లో నటించింది ఈ భామ.. సీనియర్ హీరోయిన్ గా ఇప్పటికీ సినీ ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. నేటితో త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. దీంతో అభిమానులు, సినీ ప్రముఖుల, సెలబ్రెటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె బ్యూటీని పొగుడుతూ త్రిష త్రో బ్యాక్ పిక్స్ ను షేర్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా త్రిష తన కెరీర్ ను మళ్ళీ నిలబెట్టిన చిత్రం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పోన్నియన్ సెల్వం 1 అంటూ ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకుంది.. దాదాపు 2016 నుంచి అవకాశాలు లేకుండా ఉంటున్న త్రిష మళ్లీ ఈ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చింది.. ఈ సినిమా హిట్ అవ్వడంతో త్రిషకు మళ్ళీ వరుస అవకాశాలు క్యూ పడుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news