బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ సొంతంగా కష్ట పడి పైకి వచ్చిన నటుడుప్రస్తుతం తాను హీరో గానటిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. మోక్ష హీరోయిన్ గా నటిస్తోంది.దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డైరెక్టర్ ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ ను నిర్మిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
ఇప్పుడు సోహెల్ తన ఇన్ స్టాగ్రాంలో ఆకాశ్ పూరి మీద చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నేను పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరిని, మరియు పవిత్ర గారిని రీసెంట్గా కలిశాను. మాట్లాడుతూ ఉండగానే ఎంతో క్లోజ్ అయ్యాడట. పూరి జగన్నాథ్ కొడుకుని అనే కించిత్ గర్వం కూడా చూపించలేదని, ఎంతో చక్కగా మాట్లాడడని, ఒదిగే ఉన్నాడంటూ ఆకాష్ మీద ప్రశంసలు కురిపించాడు. అలాగే పూరీ జగన్నాథ్ మీద కూడా ప్రశంసలు కురిపించాడు.
ఇక ఆకాష్ చాలా డౌన్ టూ ఎర్త్ అని అలాంటి వారిని అరుదుగా మాత్రమే చూస్తామని అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు.ఇక ఆకాష్ రూపంలో తనకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడంటూ సోహెల్ పోస్ట్ వేశాడు. ఆకాశ్‌తో మాట్లాడిన ఈ కొద్ది సమయంలో ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. మొత్తానికి సోహెల్ వేసిన పోస్ట్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆకాష్ పూరి ఆ మధ్య రొమాంటిక్ అనే సినిమాతో వచ్చాడు. ఆ తరువాత వచ్చిన చోర్ బజార్ కూడా హిట్ ఇవ్వలేదు. ఆ మధ్య బండ్ల గణేష్ కూడా కొడుకును పట్టించు కోవడం లేదని విమర్శలు చేసాడు. పూరీ జగన్నాథ్ మాత్రం ముంబయి హోటల్ లోనే ఉంటున్నాడు.