అప్పుడే వారసులకు పేరు పెట్టేసిన ఉపాసన – రాంచరణ్ దంపతులు..!

-

ప్రస్తుతం మెగా కోడలు ఉపాసన గర్భవతి అయ్యారన్న వార్త చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఉపాసన ఆరోగ్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేటిజన్ లు ఆమెకు సూచిస్తున్నారు. పదేళ్ల తర్వాత ఉపాసన, రాంచరణ్ తల్లిదండ్రులవుతున్నట్టు ప్రకటించడంతో చరణ్ తో పని చేసిన సెలబ్రిటీలు.. సినీ ప్రేక్షకులు.. ఫ్యాన్స్ ఇలా ప్రతి ఒక్కరు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం. ఉపాసన రాంచరణ్ లకు కొడుకు పుట్టినా.. కూతురు పుట్టినా ఏ పేరు పెట్టాలనే టెన్షన్ అవసరం లేకుండా ఇప్పటికే పేర్లను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

చిరంజీవి శ్రీ హనుమాన్ భక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఆశీస్సుల మేరకే తమ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని కూడా చిరంజీవి ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే చరణ్ ఉపాసనలకు కొడుకు పుడితే అంజన్ తేజ్ అని.. కూతురు పుడితే అంజనీ అనే పేరు పెట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది చిరంజీవి. రాబోయే తమ వారసుడు లేదా వారసురాలికి ఈ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీలో పేర్ల చివరన తేజ్ అనే పేరు ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే మనవడు పుడితే అంజన్ తేజ్ అని పెట్టాలని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. ఈ పేర్లు విన్న నటిజెన్లు రెండు పేర్లు కూడా చాలా బాగున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news