కమెడియన్ ఆలీ ఇండస్ట్రీకి దూరం కానున్నాడా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్గా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో, కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఆలీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరం కానున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కమెడియన్ ఆలీ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు గత కొన్ని సంవత్సరాలుగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హోస్టుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఎంతోమంది తారలు వచ్చి తమ జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఆలీతో పంచుకోవడం జరిగింది. ఈ సినిమా ఇప్పుడు నిరంతరాయంగా కొనసాగుతూ మరింత దూసుకుపోతున్న నేపథ్యంలో ఆలీ కి రాజకీయాలలో ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ గా పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను సినిమాలకు, షోలకి గుడ్ బై చెప్పబోన్నట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి సంబంధించి ప్రోమో ఒకటి విడుదల కాగా ఆ ప్రోమోలో సుమ హాజరైనట్లు తెలుస్తోంది.

అంతేకాదు ఆలీ ప్లేస్ లో సుమ.. సుమా ప్లేస్ లో ఆలీ ఉన్నట్లు మనం చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఆలీతో సరదాగా కార్యక్రమానికి కొత్త యాంకర్ సుమ రాబోతున్నట్లు తెలుస్తోంది. మరొకపక్క కమెడియన్ ఆలీ పూర్తిగా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇది ప్రోమో కోసమా లేక శాశ్వతంగానే ఆలీ ఇండస్ట్రీకి దూరం కానున్నాడా అనేది సందేహంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news