EPS: రిటైర్ అయ్యాక మీకు వచ్చే పెన్షన్ ని ఇలా లెక్కపెట్టచ్చు..!

-

ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఎన్నో సౌకర్యలను ఇస్తుంది. ఈపీఎస్ అనేది ఈపీఎఫ్ఓ ​​ద్వారా నిర్వహించే స్కీమ్. ఉద్యోగుల ప్రతి నెలా ఉద్యోగి ప్రాథమిక వేతనం లో 12 శాతం + డీఏ పీఎఫ్ ఖాతాలో పడతాయి. అలానే యజమాని సహకారం కూడా అంతే వుంది. ఇందులో 8.33% ఉద్యోగి పెన్షన్ ఫండ్ అయితే మిగిలిన 3.67% పీఎఫ్ ఖాతా లో పడుతుంది.

58 సంవత్సరాల వయస్సు తరవాత ఉద్యోగి పీఎఫ్ ఖాతా లో జమ చేసిన డబ్బులన్నీ ఒకేసారి డబ్బులు వస్తాయి. అయితే పీఎఫ్ మొత్తం ఆ ఉద్యోగి సహకారం ఆధారంగా ఫార్ములా ప్రకారం నిర్ణయించబడుతుంది. ఇక ఆ ఫార్ములా గురించి చూద్దాం.

”ఉద్యోగికి నెలవారీ జీతం= పెన్షన్ పొందదగిన జీతం X పెన్షనబుల్ సర్వీస్ /70.” పెన్షనబుల్ జీతం గరిష్ట పరిమితి 15 వేల రూపాయలు. జీతంలో 8.33% అతని పెన్షన్ ఖాతాలో పడతాయి. జీతం కనుక పదిహేను వీలైతే 15000 X 8.33 / 100 = రూ. 1250 వెళ్తుంది.

పెన్షన్ ఫార్ములా ప్రకారం అయితే ఒకరి నెలవారీ జీతం (గత 60 నెలల సగటు జీతం) రూ. 15 వేలు, ఉద్యోగ వ్యవధి 20 సంవత్సరాలు అయితే, 15000X 20/70 = రూ. 4286 అవుతుంది. ఇరవై ఐదు ఏళ్ళు కి 15000 X 25/70 = రూ 5357, వ్యవధి 30 సంవత్సరాలు నెలవారీ జీతం రూ. 6428 అవుతుంది. 15 వేల లిమిట్ తీసి జీతం 30 వేలు అయితే (30,000 X 30)/70 = 12,857. ఇలా పెన్షన్ ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news