హిట్ అయితే లక్కీ! లేకుంటే ఐరన్ లెగ్ అదే నిజం!

-

కొందరు హీరోయిన్స్ కొన్ని సార్లు తెలివిగా ఆలోచించి స్కిన్ షో చేస్తూనే, డబ్భులు తక్కువ ఇచ్చినా సర్దుకొని మరిన్ని అవకాశాలు పడుతూ ఉంటారు.అలాంటి వారిలో ముందు వరసలో ఉంటుంది హీరోయిన్ నిధి అగర్వాల్.నిధి నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను.. సినిమా, హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ లాంటి  హిట్ సినిమాలలో నటించింది.

ఈ సినిమాల తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. ఇక ఇక్కడ లాభం లేదని కోలీవుడ్ పరిశ్రమలో అదృష్టం పరీక్షించు కోవడం కోసం చెన్నై వెళ్ళింది. ఆమె అదృష్టం బాగుండి కోలీవుడ్లో మంచి అవకాశాలు దక్కాయి.వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన నిధి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

రీసెంట్ గా కథల విషయంలో కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పింది . తాను మాట్లడుతూ దాదాపు అన్ని కథలూ పేపర్ మీద బావుంటాయ్.  తీసిన తర్వాత తెలుస్తుంది హిట్టా ఫట్టా అని. ఇక  హీరోయిన్ల విషయంలో అయితే 90 శాతం లక్కు వల్లనే స్టార్‌డమ్ వస్తుంది. హిట్ అయితే లక్కీ అని వెంటబడతారు లేకుంటే ఐరన్ లెగ్ అంటూ పట్టించుకోరు అంటూ ఒపెన్ గా చెప్పింది

Read more RELATED
Recommended to you

Latest news