ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా పోషించింది. ఆ తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ వంటి కామెడీ షోకి న్యాయ నిర్ణేతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అలుపెరుగని బాటసారిలా శ్రమిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒకవైపు రాజకీయాలలో కూడా తన వంతు ప్రయత్నం చేసిన ఈమె అక్కడ అదృష్టం వరించి తాను ప్రజలకు చేసిన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా ఇప్పటికే పాపులర్ అయినటువంటి ఎంటర్టైన్మెంట్ షోలు స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 10 ఏళ్లుగా బుల్లితెరపై తిరుగులేని కామెడీ షో అనిపించుకున్న జబర్దస్త్ కూడా 2023లోకి ఎంటర్ అవ్వడంతో అరుదైన మైలురాయిని అందుకుంటోంది. జబర్దస్త్ షో ఏకంగా 500 వ ఎపిసోడ్ కి చేరుకుంది. జనవరి 5న ప్రసారం కానున్న ఎపిసోడ్ తో జబర్దస్త్ 500వ ఎపిసోడ్ క్లబ్లో చేరనుంది. ఈ స్పెషల్ ఎపిసోడ్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ.. ఏపీ మంత్రి నటి రోజా ని గెస్ట్ గా ఆహ్వానించారు. సినిమాలకి దూరంగా ఉన్నా ప్రేక్షకులు ఇంకా గుర్తు పెట్టుకున్నారు అంటే దానికి కారణం జబర్దస్త్ షో అని చెప్పాలి.
ఈ షో కి ముఖ్యఅతిథిగా హాజరైన రోజా జడ్జి స్థానంలో కృష్ణ భగవాన్ , ఇంద్రజ పక్కన కూర్చొని స్కిట్స్ ఎంజాయ్ చేశారు. మరోపక్క జబర్దస్త్ 500 వ ఎపిసోడ్ కమెడియన్ రాకెట్ రాఘవకి ఎంతో స్పెషల్గా మారనుంది. ఎందుకంటే జబర్దస్త్ మొదలైన దగ్గర్నుంచి ఇప్పటివరకు చాలామంది కమెడియన్స్ పేరు తెచ్చుకున్నారు. షో ద్వారా సినిమా అవకాశాలు అందుకుని సినిమాలు కూడా చేసుకుంటున్నారు. కానీ జబర్దస్త్ లో మొదటి నుండి బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ అవుతున్న టీం లీడర్ రాకెట్ రాఘవ. అందుకే ఆయనను స్పెషల్ గెస్ట్ గా వచ్చిన మంత్రి రోజా సత్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.